వేములవాడ రాజన్న శక్తిని దేశవ్యాప్తం చేసిన మోదీ :  మంత్రి బండి సంజయ్​ 

వేములవాడ రాజన్న శక్తిని దేశవ్యాప్తం చేసిన మోదీ :  మంత్రి బండి సంజయ్​ 
  • కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​

వేములవాడ, వెలుగు :  వేములవాడ రాజన్న శక్తిని ప్రధాని నరేంద్ర మోదీ దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా పేరు పొందిందని కేంద్రహోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్​ పేర్కొన్నారు.  మహాశివరాత్రి జాతర సందర్భంగా బుధవారం వేములవాడ రాజన్నను దర్శించుకుని పట్టువస్ర్తాలు సమర్పించారు.

అనంతరం కేంద్రమంత్రి సంజయ్ మాట్లాడుతూ రాజన్నను ప్రధాని దర్శించుకుని వెళ్లాక..  వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి కూడా భక్తులు భారీగా తరలివస్తుండడంతో  రద్దీగా మారిపోయిందన్నారు. మహా శివరాత్రి ఏర్పాట్లు చాలా బాగున్నా యని ఆలయ ఈఓ, సిబ్బందికి అభినందిస్తుంచారు.  ఆయన వెంట బీజేపీ నేతలు ప్రతాప రామకృష్ఱ, గోపి,  మల్లికార్జున్​ తదితరులు ఉన్నారు. 
 
కేసీఆర్ హయాంలోనే అభివృద్ధి: కవిత 

కేసీఆర్ హయాంలోనే రూ. 250 కోట్లు ఖర్చు చేసి రాజన్న ఆలయాన్ని అభివృద్ధి  చేశామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు.   ప్రభుత్వాలు మారినంత ఆలయ అభివృద్ధి ఆగవద్దని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొనసాగించాలని కోరారు. మహా శివరాత్రి సందర్భంగా  ఆమె రాజన్నను దర్శించుకుని మీడియాతో మాట్లాడారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అంటేనే చేనేత జిల్లాగా పేరు పొందిందని..  ప్రస్తుత ప్రభుత్వం సక్రమంగా ఉపాధి కల్పించకపోతుండడంతో  ఉరిసిల్లగా మారుతుందని ఆరోపించారు.