రాజన్న సిరిసిల్ల: వేములవాడ రాజన్న ఆలయాన్ని సందర్శించారు ప్రధాని నరేంద్ర మోదీ. మే 8వ తేదీ బుధవారం ఉదయం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా వేములవాడ ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ.. శ్రీ రాజ రాజేశ్వర స్వామి వారిని దర్శించుకొనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాజన్నకు ఇష్టమైన కోడె మొక్కులు చెల్లించారు ప్రధాని. అంతకుముందు ఆలయానికి వచ్చిన ప్రధాని మోదీకి ఆలయ అధికారులు, పూజారులు ఘన స్వాగతం పలికారు.
అనంతరం పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కి మద్దతుగా పట్టణంలోని బైపాస్ రోడ్డులో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ బహిరంగ సభలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, రాజ్య సభ ఎంపి కె. లక్ష్మణ్, తదితర బీజేపీ నాయకులు పాల్గొన్నారు.