ప్రధాని నరేంద్ర మోడీ వరంగల్ టూర్ ఖరారైంది. 2023 జులై8న మోడీ వరంగల్ కు రానున్నారు. వరంగల్ లో ఏర్పాటు చేయనున్న కాజీపేట వ్యాగన్ ఓరలింగ్ సెంటర్, మెగా టెక్స్ టైల్ పార్క్ లకు మోడీ శంకుస్థాపన చేయనున్నారు.
దీనికి సంబంధించిన ఏర్పాట్లను వరంగల్ జిల్లాకు సంబంధించిన లీడర్లతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫోన్ లో మాట్లాడారు. శంకుస్థాపన అనంతరం స్థానికంగా ఏర్పాటు చేయనున్న బహిరంగ సభలో పాల్గొని మోడీ మాట్లాడనున్నారు. ఈ సభలో మోడీ ఏం మాట్లాడనున్నారు అన్నది ఆసక్తికరంగా మారనుంది.
ఇటీవల మధ్యప్రదేశ్ లో పర్యటించిన మోడీ ..సీఎం కేసీఆర్ ఫ్యామిలీపై నేరుగానే కామెంట్స్ చేశారు. కేసీఆర్ బిడ్డ బాగుండాలంటే బీఆర్ఎస్ కు ఓటేయ్యాలని, మీ బిడ్డలు బాగుండాలంటే బీజేపీకి ఓటేయ్యాలని మోడీ కామెంట్స్ చేశారు. మోడీ చేసిన ఈ కామెంట్స్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి.