సీఎం కేసీఆర్ ఫ్యామిలీని టార్గెట్ చేశారు ప్రధాని మోదీ. రెండు సార్లు.. పదేళ్లుగా తెలంగాణ రాష్ట్రాన్ని పాలిస్తున్న కేసీఆర్ ఫ్యామిలీ చేసిన అవినీతిని కక్కిస్తానని.. తెలంగాణ ప్రజల కాళ్ల దగ్గర.. కేసీఆర్ అవినీతి సొమ్మును పెడతానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మోదీ. నిజామాబాద్ లో జరిగిన బీజేపీ భారీ బహిరంగ సభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. ఈ వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.
తెలంగాణ వచ్చింది.. తెచ్చుకున్నది ప్రజల బాగోగుల కోసం అని.. కేసీఆర్ కుటుంబం కోసం కాదంటూ కామెంట్స్ చేశారు మోదీ. బీఆర్ఎస్ పార్టీ దోచుకున్న సొమ్మునంతా లెక్కతీస్తా.. నాపై నమ్మకం ఉంచి తెలంగాణలో బీజేపీకి ఒక్క అవకాశం.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరారు మోదీ. ప్రతి విషయంలో తెలంగాణ జనానికి బీజేపీ అండగా ఉంటుందని.. ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం బీజేపీ కట్టుబడి ఉందన్నారు మోదీ.
ALSO READ: కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ నన్ను కల్సిండు
తెలంగాణలో కుటుంబ పాలన నడుస్తుందని.. కేసీఆర్, అతని కొడుకు, బిడ్డ, అల్లుడుతో పాటు రాష్ట్రాన్ని దోచుకోవటానికి ఎవరూ మిగల్లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మోదీ.