మోదీ OBC కులంలో పుట్టలేదు : రాహుల్ గాంధీ

మోదీ OBC కులంలో పుట్టలేదు : రాహుల్ గాంధీ

ప్రధానమంత్రి ఓబీసీ కులంలో పెట్టలేదని.. ఆయన పదేపదే తన కులం గురించి అబద్దాలు చెబుతున్నారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. గుజరాత్ రాష్ట్రంలో తెలి కులంలో మోదీ పుట్టారని ఆరోపించారాయన. ఒడిశా రాష్ట్రంలో భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్.. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓబీసీ కులంలో పెట్టలేదు కాబట్టే.. మోదీ కుల గణన చేయటం లేదన్నారు. 2 వేల సంవత్సరంలో మోదీకి ఓబీసీ కులం కార్డును.. బీజేపీ ఇచ్చిందని.. కులంతో ఓట్ల రాజకీయం చేసిందని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఓబీసీ కులంలో పుట్టినట్లయితే.. ఎందుకు కుల గణన చేయటం లేదని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. మోదీ తన కులం గురించి ఎప్పుడూ అబద్దాలే చెబుతారని.. పుట్టింది తెలి కులంలో అని కొత్తగా చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.