సోనియా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

సోనియా కోలుకోవాలంటూ మోడీ ట్వీట్

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోలుకోవాలని కోరుకుంటున్నట్లు భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు. సోనియా గాంధీ కరోనా వైరస్ బారిన పడిన సంగతి తెలిసిందే. గురువారం స్వల్ప అస్వస్థతకు గురి కావడంతో వైద్యులు ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కరోనా పరీక్షల్లో ఆమెకు పాజిటివ్ వచ్చినట్లు తేలింది. దీంతో ఆమె ఐసోలేషన్ లోకి వెళ్లారు. సోనియా కరోనా వైరస్ సోకిందని తెలుసుకున్న పలువురు కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. దేవాలయాల్లో పూజలు చేయాలని నేతలు కార్యకర్తలకు సూచిస్తున్నారు. సోనియా గాంధీ పలు సమావేశాలు పాల్గొన్నారు. ఈ సమావేశాలకు పలువురు నేతలు హాజరయ్యారు.

ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడడంతో నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నేతలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సోనియా గాంధీ ఇటీవలే పలు సమావేశాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాలకు పలువురు నేతలు హాజరయ్యారు. ప్రస్తుతం ఆమె కరోనా బారిన పడడంతో నేతలు కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది నేతలకు కరోనా సోకినట్లు తెలుస్తోంది. మరోవైపు... ఈనెల 08వ తేదీన ఆమె ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ముందు హాజరు కావాల్సి ఉంది. కానీ.. కరోనా వైరస్ బారిన పడడంతో ఆమె హాజరయ్యే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. 
 

మరిన్ని వార్తల కోసం : -

బీజేపీలో చేరిన హార్దిక్ పటేల్..


సోనియా గాంధీకి కరోనా