- ఇన్వెస్ట్ చేయాలని కోరిన ప్రధాని
న్యూఢిల్లీ:మనదేశ ఎనర్జీ సెక్టార్లోని అపార అవకాశాలను పెట్టుబడిదారులు ఉపయోగించుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. రాబోయే ఐదేళ్లలో 50 గిగావాట్ల రెన్యువబుల్ఎనర్జీని ఉత్పత్తి చేయాలని టార్గెట్గా పెట్టుకున్నామని అన్నారు.
2030 నాటికి ఏటా 50 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్తయారు చేస్తామని చెప్పారు. ఆయిల్, గ్యాస్ నిక్షేపాల కోసం బిడ్డింగ్ నిర్వహిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని, ఢిల్లీలో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ 2025ను ఉద్దేశించి వర్చువల్గా ప్రసంగించారు.
‘‘21వ శతాబ్దం ఇండియాదేనని నిపుణులు అందరూ అంటున్నారు. భారత్ తన వృద్ధిని తాను ముందుకు తీసుకువెళ్లడమే కాదు.. ప్రపంచవృద్ధికి ఊతంగా ఉంటోంది. మనదేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది. మన రాజకీయ వ్యవస్థ స్థిరంగా ఉంది. ఇండియా నుంచి ఎనర్జీ ట్రేడ్ సులువు. ఆకర్షణీయం”అని ఆయన చెప్పారు.