- 76% రేటింగ్‌తో గ్లోబల్ వరల్డ్ లీడర్‌గా మన ప్రధాని
- రెండో స్థానంలో స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్.. ఏడో స్థానంలో బైడెన్
- మార్నింగ్ కన్సల్ట్ సంస్థ తాజా సర్వేలో వెల్లడి
న్యూఢిల్లీ : మన ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి గ్లోబల్ లీడర్ల జాబితాలో టాప్ లో నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ ఉన్న నేతగా నిలిచారు.. మార్నింగ్ కన్సల్ట్ సంస్థ నిర్వహించిన ‘గ్లోబల్ లీడర్ అప్రూవల్’ సర్వేలో మొదటి స్థానం దక్కించుకున్నారు. ఆయనకు ఏకంగా 76 శాతం మంది ఆమోదం తెలపగా.. రెండో స్థానంలో నిలిచిన స్విట్జర్లాండ్ ప్రెసిడెంట్ అలెయిన్ బెర్సెట్64 శాతం ప్రజామోదం లభించింది. కొన్నేండ్లుగా ప్రధాని మోదీ ఈ సర్వేలో నెంబర్ వన్ గా ఉంటున్నారు. తాజాగా నిర్వహించిన సర్వేలోనూ ఆయనకు ప్రజాదరణ తగ్గలేద ని తేలింది. కాగా, ఈ జాబితాలో అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ఏడో స్థానంలో ఉన్నారు. ప్రపంచ నేతగా బైడెన్ కు 40 శాతం మంది ఓటే శారు.
కాగా, ఈ నెల 6 వ తేదీ నుంచి 12 వరకు నిర్వహించిన సర్వేలో ప్రపంచ నేతల్లో అతి తక్కువ నిరాదరణ కలిగిన నేతగా కూడా మోదీ నిలిచారు. ప్రపంచవ్యాప్తంగా మోదీకి ఉన్న నిరాదరణ కేవలం 18% మాత్రమేనని సర్వేలో వెల్లడైంది. మరోవైపు, అత్యంత నిరాదరణ కలిగిన లీడర్ గా కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో నిలిచారు. ఆయనను నిరాదరిస్తూ ఏకంగా 58% మంది ఓటేశారు. ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందిన 22 మంది లీడర్లతో ఈ సర్వే నిర్వహించినట్లు మార్నింగ్ కన్సల్ట్ సంస్థ వెల్లడించింది. ప్రజాదరణ విషయంలో సౌత్ కొరియా అధ్యక్షుడు యున్ సుక్ యోల్ నిలిచాడు.
ALSO READ: నిండు గర్భిణిని టైరుపై వాగు దాటించారు
సర్వేపై బీజేపీ నేతల స్పందన..
జీ20 సమిట్ ను విజయవంతంగా నిర్వహించిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా మోదీ గ్రాఫ్ మరింత పెరిగిందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి అనిల్బాలుని ట్వీట్ చేశారు. నమ్మకానికి, నాయకత్వానికి మోదీ ఓ సింబల్ అని కేంద్ర మంత్రి శోభా కరంద్లాజె పేర్కొన్నారు. మోదీ స్ఫూర్తిదాయక నేత అంటూ బీజేపీ ఏపీ ప్రెసిడెంట్ పురందేశ్వరి కొనియాడారు.