PM Modis epic podcast: పీఎం మోదీ ఎపిక్ పాడ్కాస్ట్.. పవర్ ఫుల్ కన్వర్జేషన్..

PM Modis epic  podcast: పీఎం మోదీ ఎపిక్ పాడ్కాస్ట్.. పవర్ ఫుల్ కన్వర్జేషన్..

ప్రధాని మోదీ జీవిత విశేషాలకు సంబంధించిన పాడ్కాస్ట్పై  అమెరికన్ పాడ్కాస్టర్ లెక్స్ ఫ్రిడ్మన్ సోషల్ మీడియా పోస్ట్ ఇంటర్నెట్లో హల్చల్ చేస్తోంది. మోస్ట్ పవర్ఫుల్ కన్వర్జేషన్..ఎపిక్ పాడ్కాస్ట్.. నా జీవితంలో తాను  చేసిన ఇంటర్వ్యూల్లో అత్యంత పవర్ ఫుల్ ఎపిక్ పాడ్కాస్ట్ మీ ముందుకు వస్తోంది అంటూ ప్రధాని మోదీతో తన ఎపిక్ పాడ్కాస్ట్ గురించి చెబుతూ ఫ్రిడ్మన్ తన ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. 

‘‘ఆదివారం(మార్చి16) సాయంత్రం 5.30 గంటలకు ఈ పోడ్ కాస్ట్ విడుదల అవుతుంది. భారత ప్రధాని మోదీతో మూడు గంటల పాటు అద్బుతమైన ఇంటర్వ్యూ చేశాను. ఇది నా జీవితంలో అత్యంత పవర్ ఫుల్ ఇంటర్వ్యూ ఇది’’ అని ఫ్రిడ్మన్ షేర్ చేశారు. 

Also Read:-వామ్మో.. ఇది పిచ్చా.. వెర్రా.. అంతకు మించా.. చూస్తుంటేనే భయమేసింది..!

ఫ్రిడ్మన్ ప్రకటనపై ప్రధాని మోదీ కూడా స్పందించారు. ‘‘తన చిన్ననాటి అనుభవాలు, హిమాలయాల్లో గడిపిన సమయం,రాజకీయ ప్రయాణం వంటి విభిన్న అంశాలను పంచుకున్నట్లు మోదీ చెప్పారు. ఫిబ్రవరిలో రికార్డు చేసిన పాడ్ కాస్ట్ ను వినడం ద్వారా సంభాషణలో పాల్గొనాలని..  సోషల్ మీడియా ద్వారా  మోదీ ప్రజలను కోరారు. డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు, AIలో దేశం పురోగతిపై కూడా చర్చించినట్లు తెలిపారు. 

ఎవరీ లెక్స్ ఫ్రిడ్‌మన్? 

ఫ్రిడ్‌మన్ అమెరికాకు చెందిన ప్రముఖ కంప్యూటర్ శాస్త్రవేత్త, పాడ్‌కాస్టర్. ది లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్ ను నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, టెస్లా సీఈఓ ఎలోన్ మస్క్, అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్, ఫేస్‌బుక్ కో ఫౌండర్ మార్క్ జుకర్‌బర్గ్,ఉక్రేనియన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ వంటి ప్రముఖ వ్యక్తుల ఇంటర్వ్యూను చేశారు. తాను ఇప్పటివరకు అధ్యయనం చేసిన అత్యంత ఆకర్షణీయమైన వ్యక్తి ప్రధాని మోదీ అని అభివర్ణించారు లెక్స్ ఫ్రిడ్‌మన్.

ఇది ప్రధాని మోదీ రెండో పాడ్‌కాస్ట్

జనవరిలో జెరోధా ఫౌండర్ నిఖిల్ కామత్‌తో ప్రధాని మోదీ పాడ్‌కాస్ట్ నిర్వహించారు. మెహ్సానా జిల్లాలోని వాద్ నగర్ అనే చిన్న పట్టణంలో తన మూలాల గురించి ఈ సంభాషణలో మోదీ హైలైట్ చేశారు. గైక్వాడ్ రాష్ట్ర పట్టణమైన వాద్ నగర్ విద్యాభివృద్ది గురించి, చెరువు, పోస్టాఫీసు,లైబ్రరీ వంటి సౌకర్యాలు, వాద్నగర్లో తనకున్న అనుబంధాన్ని మోదీ తన అనుభవాలను గుర్తు చేసుకున్నారు.