మోడీ భలే హుషార్!

మోడీ భలే హుషార్!

ప్రధానమంత్రి అనగానే మన కళ్ల ముందు ఒక బొమ్మ కదలాడుతుంది. మొహంలో ఏమాత్రం నవ్వులేకుండా చాలా సీరియస్​ పొలిటీషియన్​ కనిపిస్తారు. ఇదంతా గతం. సీరియస్ ఫేస్ కల్చర్​కి ప్రధాని నరేంద్ర మోడీ ఫుల్ స్టాప్ పెట్టారు. మోడీలో చిరునవ్వుతో ఉల్లాసంగా ఉండే ఓ కొత్త లీడర్​ని చూస్తాం.  ఒకరోజు రంగురంగుల కుర్తా పైజామాలు వేసుకుని హల్​చల్ చేస్తే, ఇంకో రోజు డ్రమ్స్ వాయిస్తూ కనిపిస్తారు. మరో రోజు ఉత్తరాఖండ్ జిమ్ కార్బైట్ పార్కులో అడవి జంతువుల మధ్య అడ్వంచర్ టూర్​లో పాల్గొంటారు. ఈ అరుదైన గుణమే ప్రపంచ దేశాల్లో మోడీ ఇమేజ్ పెంచింది. ఆయనను వరల్డ్ లీడర్​ని చేసింది.

ప్రధాని మోడీ మిగతావారి కంటే డిఫరెంట్. ప్రధాని అంటే ఇలాగే ఉండాలి అనే మూస ధోరణికి అడ్డుకట్ట వేశారు. ఈ లక్షణమే  ప్రపంచవ్యాప్తంగా ఆయన ఇమేజ్ పెంచింది. దీనికి ఇజ్రాయిల్ ఎన్నికల ప్రచారమే నిదర్శనం. సెప్టెంబర్ 17న జరిగే ఇజ్రాయిల్ ఎన్నికల ప్రచారంలో నరేంద్ర మోడీ చేస్తున్న సందడి అంతాఇంతా కాదు. అంటే మోడీ ఇజ్రాయెల్ ఎన్నికల్లో పాల్గొంటున్నారని కాదు అర్థం. నరేంద్ర మోడీతో తానున్న వీడియోను ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ప్రచారంలోకి పెట్టారు. తాను మామూలు నాయకుడిని కాదని నెతన్యాహు చెప్పడమే ఈ వీడియో ఉద్దేశం. నరేంద్ర మోడీ తో పాటు అమెరికా  ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్, రష్యా ప్రెసిడెంట్ బోరిస్ పుతిన్ వంటి వరల్డ్ లీడర్లతో తనకు కాంటాక్ట్ ఉందని ప్రజలకు వివరించడమే  నెతన్యాహు అసలు టార్గెట్.  ప్రపంచస్థాయి నాయకులతో మంచి సంబంధాలు ఉన్న తనకు  ప్రతిపక్షాలు అసలు  పోటీయే కాదన్నారు. మోడీతో తాను దిగిన ఫొటోలను  టెల్ అవీవ్ నగర వీధుల్లో పెద్ద పెద్ద బ్యానర్లుగా కట్టారు.

డోలు బాజే…

డ్రమ్స్ వాయించడంలోనూ మోడీకి అనుభవముంది. ఐదేళ్ల కిందట జపాన్ వెళ్లినప్పుడు అక్కడి సంప్రదాయాలకు తగ్గట్టు డ్రమ్స్ వాయించి అందరినీ ఆశ్చర్యపరిచారు.  ఆ తర్వాత ఆఫ్రికా దేశాల పర్యటనల్లోనూ డ్రమ్స్ వాయించారు. మనదేశంలో  ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లినప్పుడు  అక్కడి సంప్రదాయాలకు అనుగుణంగా డ్రమ్స్ వాయిస్తుంటారు.

మోడర్న్​ ఫ్యాషన్​ ఐకాన్​

పాలిటిక్స్​లోనే కాదు ఫ్యాషన్​లోనూ మోడీ సత్తా చాటారు. సహజంగా కలర్ ఫుల్ కుర్తా పైజా మా పైన జాకెట్ వేసుకుని అందరినీ ఆయన ఆకట్టుకుంటారు. మోడీ డ్రస్సు హాట్ ఫేవరెట్​గామారింది. రంగురంగుల కుర్తా పైజామా, పైన మోడీ మార్క్ జాకెట్ కోసం అమ్మాయిలు వేయడం మామూలైంది. ఆయన బ్లూ కలర్​ కోటుపై ఒక సారి దేశ వ్యాప్తంగా చర్చ కూడా సాగింది.

అడ్వంచర్ టూర్​లో​ ప్రధాని

సహజంగా ప్రధాని అంటే సెక్యూరిటీ చాలా హై రేంజ్ లో ఉంటుంది. సెక్యూరిటీ జోన్ దాటి ప్రధానులెవరూ బయటకు రారు. అయితే మోడీ ఇందుకు మినహాయింపు. భద్రత అంశాన్ని పక్కన పెట్టి  ఈ ఏడాది ఫిబ్రవరిలో ఉత్తరాఖండ్ జిమ్ కార్బైట్ నేషనల్ పార్కులో అడ్వంచర్ టూర్ లో మోడీ పాల్గొన్నారు. అడవి జంతువుల మధ్య ఉల్లాసంగా గడిపారు . మ్యాన్ వర్సెస్ వైల్డ్ పేరుతో చేసిన ఈ అడ్వంచర్ షోను బేర్ గ్రిల్స్ రూపొందించారు.  అతనితో కలిసి మోడీ చేసిన ఈ సాహస యాత్రకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ కాగానే సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి  24 గంటల్లోనే లక్షల్లో వ్యూస్ వచ్చాయంటే సాహసయాత్రకు జనం ఎంత థ్రిల్లయ్యారో తెలుస్తుంది.

పడవ నడిపిన మోడీ

బేర్ గ్రిల్స్ తో కలిసి మోడీ అడవిలో కొంతదూరం ప్రయాణించారు. మధ్య లో  సెలయేరు వచ్చింది. ఇద్దరూ చిన్న పడవలో సెలయేరు దాటారు. మోడీకూడా కాసేపు పడవ నడిపారు. ఇదంతా మోడీలోని మరో కోణాన్ని  ప్రపంచానికి తెలియచేస్తుందన్నారు బేర్ గ్రిల్స్ .