పరీక్షపై మరో చర్చ

ప్రజలకు ఎలా దగ్గరవ్వాలో ప్రధాని మోడీకి  బాగా తెలుసు. ఎలక్షన్లకు ముందు ఛాయ్​ పె చర్చ పేరుతో దేశమంతా లైవ్​ వచ్చేలా చూసుకున్నారు. ఆ తర్వాత నెక్ట్స్​ జనరేషన్​ని టార్గెట్​ చేసుకుంటూ ‘పరీక్ష పె చర్చ’ ప్రోగ్రాం తీసుకున్నారు. రెండుసార్లు సక్సెస్​ఫుల్​గా జరిపిన ఈ ‘చర్చ’ ఇప్పుడు థర్డ్​ సెషన్​లోకి ప్రవేశించింది. స్టూడెంట్లకు పరీక్షలంటే ఉండే పరేషానీని పోగొట్టడమే ఈ ప్రోగ్రాం ఉద్దేశం. వచ్చే నెల 16న దేశం నలుమూలల స్టూడెంట్లు, పేరెంట్స్​తో ప్రధాని మోడీ ఇంటరాక్ట్​ అవుతారు.

ప్రధాని నరేంద్ర మోడీ సక్సెస్​ఫుల్​గా రెండోసారి అధికారంలోకి వచ్చాక… తనకు పాపులారిటీ పెంచిన ప్రోగ్రాంలను వదులుకోవడం లేదు. దానిలో భాగంగానే మూడో విడత ‘పరీక్షా పే చర్చ’ కార్యక్రమాన్ని ప్రధాని మోడీ నిర్వహిస్తున్నారు. స్టూడెంట్లకు పరీక్షలంటే భయం పోగొట్టడం, వాళ్లు ఒత్తిడికి గురి కాకుండా చూడటమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. వరుసగా రెండేళ్లు (2018, 2019ల్లో) సక్సెస్ అయిన ఈ ప్రోగ్రాం ఇప్పుడు మూడో ఏడాదిలోకి అడుగుపెట్టబోతోంది. గతంలో నిర్వహించిన తాల్​ కటోరా స్టేడియం (న్యూఢిల్లీ)లోనే ‘పరీక్ష పె చర్చ–2020’కూడా నిర్వహించబోతున్నారు. తొమ్మిది, పదో తరగతి స్టూడెంట్లు మాత్రమే ఇందులో పార్టిసిపేట్ చేయడానికి అర్హులు.

అయితే, ఈ కార్యక్రమం సౌత్​ ఇండియన్లకు పెద్ద పండుగైన సంక్రాంతి రోజున జరుపుతున్నారు. ఆ రోజు స్కూళ్లన్నింటికీ పొంగల్​, సంక్రాంతి సెలవులు ఉంటాయి. అయినప్పటికీ జనవరి 16న ‘పరీక్ష పె చర్చ’ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. గతంలో రెండుసార్లు కేవలం ఢిల్లీకి చెందిన స్టూడెంట్లే పాల్గొన్నారు. ఈసారి దేశంలోని అన్ని ప్రాంతాల స్టూడెంట్లకు అవకాశం కల్పించాలని ప్రధాని మోడీ నిర్ణయించుకున్నారు.

ఈ ఫీచర్స్​లో సత్తా చాటిన స్టూడెంట్లను వచ్చే ఏడాది ఢిల్లీలోని తాల్ కటోరా స్టేడియంలో జరిగే ‘పరీక్ష పె చర్చ–2020’ కార్యక్రమానికి సెలెక్ట్ చేస్తారు. ఇలా సెలెక్ట్ అయిన వాళ్లందరూ ప్రధాని మోడీతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. పరీక్షలకు సంబంధించిన ఏ అంశంపైనైనా ప్రధాని మోడీకి స్టూడెంట్లు ప్రశ్నలు వేయవచ్చు. చిన్నారులే కాదు వాళ్ల తల్లిదండ్రులు కూడా ప్రధానితో ముఖాముఖిలో పాల్గొనవచ్చు. ఈ ప్రశ్నలన్నింటికీ  ప్రధాని మోడీ సమాధానాలిస్తారు.

ఎగ్జామ్స్ రాయబోయే చిన్నారులకు ఈ ఇంటరాక్షన్ ఎంతో  ఇన్​స్పైరింగ్​గా ఉంటుందంటున్నారు ఎక్స్​పర్ట్స్​. ‘పరీక్ష పె చర్చ–2020’లో దాదాపు రెండు వేల మంది స్టూడెంట్లు, తల్లిదండ్రులు, టీచర్లు పార్టిసిపేట్ చేస్తారని భావిస్తున్నారు. దూరదర్శన్​లో ప్రసారమయ్యే ఈ ప్రోగ్రాంను సిక్స్, సెవెంత్  స్టూడెంట్లు చూడాలని ప్రభుత్వం కోరుతోంది. 2019లో జరిగిన కార్యక్రమాన్ని ఎనిమిదిన్నర కోట్లమంది స్టూడెంట్లు దూరదర్శన్​లో చూడటం లేదా రేడియోలో వినడం చేశారు. సోషల్ మీడియాలో ‘పరీక్ష పె చర్చ’ కార్యక్రమానికి మంచి స్పందన  వచ్చింది. ఆ ఉత్సాహంతోనే 2020 ప్రోగ్రాం కూడా సక్సెస్ అవుతుందని భావిస్తున్నారు.