వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైంది.. ప్రధాని మోడీ

రాజంపేటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ప్రధాని మోడీ వైసీపీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేసారు. అధికారం ఇస్తే వైసీపీ మోసం చేసిందని అన్నారు. ఐదేళ్ళలో వైసీపీ ప్రభుత్వం చేసింది ఏమీ లేదని, అభివృద్ధిని నిర్లక్ష్యం చేసిందని అన్నారు. పోలవరం ఏం చేశారో మీరే చూస్తున్నారని, వైసీపీ శాండ్ మాఫియా వల్లనే అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయిందని, 12మంది మరణించారని అన్నారు ప్రధాని మోడీ. రాయలసీమ ప్రాంతంలో వ్యవసాయానికి సాగునీరు అందించటం లేదని అన్నారు మోడీ.

రాయలసీమలో ఖనిజ సంపద ఉందని, పర్యాటకంగా కూడా రాయలసీమను అభివృద్ధి చేసేందుకు అవకాశం ఉందని అన్నారు మోడీ. వైసీపీ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని, వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మాఫియాలన్నిటికీ ఎన్డీయే ప్రభుత్వం రాగానే అడ్డుకట్ట వేస్తామని అన్నారు. జల్ జీవన్ మిషన్ కు వైసీపీ ప్రభుత్వం సహకరించటం లేదని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ వికాసమే మోడీ లక్ష్యమని అన్నారు ప్రధాని మోడీ.