జంగారెడ్డి మృతి.. తెలుగులో ట్వీట్ చేసి మోడీ సంతాపం

జంగారెడ్డి మృతి.. తెలుగులో ట్వీట్ చేసి మోడీ సంతాపం

భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు మాజీ ఎంపీ  జంగా రెడ్డి  అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన మృతిపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ.. జంగారెడ్డి మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. జంగా రెడ్డి గారు బీజేపీ క్లిష్టమైన దశలో ఉన్నప్పుడు సమర్థవంతమైన వాణిని అందించారన్నారు. ఆయన కుమారుడితో మాట్లాడి సంతాపం తెలపడం జరిగిందని ట్వీట్ చేశారు మోడీ. జంగా రెడ్డి గారు ప్రజా సేవకు తన జీవితాన్ని అంకితం చేశారన్నారు. ‘జన సంఘ్ నూ , బీజేపీను ఉన్నత శిఖరాలకు తీసికెళ్ళడానికి ఆయన ఎంతో కృషి చేశారు . ఎంతో మంది ప్రజల మనసులలో స్థానాన్ని సంపాదించుకున్నారు . ఎంతో మంది కార్యకర్తలకు స్ఫూర్తి నిచ్చారు . ఆయన మరణం పట్ల చింతిస్తున్నాను’ అంటూ మోడీ ఈ సందర్భంగా తెలుగులో ట్వీట్ చేశారు. 

మరోవైపు జంగారెడ్డి పార్థివ దేహానికి హైదరాబాద్ నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయంలో  పలువురు రాజకీయ నేతలు నివాళులర్పించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.,బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు., ఎంపీ బండి సంజయ్, బీజేపీ  నాయకురాలు డీకే అరుణ., బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్‌., నల్లు ఇంద్రాసేన రెడ్డి.,పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు జంగారెడ్డి భౌతిక కాయం వద్ద నివాళురల్పించారు.