కేసీఆర్ కి.. ఇది బీజేపీ ట్రైలర్ మాత్రమే : మోదీ

కేసీఆర్ కి.. ఇది బీజేపీ ట్రైలర్ మాత్రమే : మోదీ

తెలంగాణ రాష్ట్రాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం నాశనం చేసిందన్నారు ప్రధాని మోదీ. హన్మకొండలోని బహిరంగ సభలో మాట్లాడిన మోదీ.. సీఎం కేసీఆర్, ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో.. నాలుగే నాలుగు పనులు చేశారంటూ.. వాటిని ప్రస్తావించారు.

>>> ఉదయం లేచింది మొదలు.. మోదీని తిట్టటమే పనిగా పెట్టుకున్నారని.. మిగతా ఏ పనులు చేయటం లేదంటూ చురకలు అంటించారు మోదీ
>>>  రెండో పనిగా కుటుంబ రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని.. అన్ని పదవులు కేసీఆర్ కుటుంబానికే ఉన్నాయన్నారు మోదీ.
>>> మూడో పనిగా తెలంగాణ ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారని.. మిగులు నిధులతో ఉన్న తెలంగాణను అప్పుల తెలంగాణ చేశారన్నారు మోదీ
>>> తెలంగాణలోని బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో కూరకుపోయిందని.. ప్రతి పనిలోనూ అవినీతి జరుగుతుందని.. అవినీతి ఆరోపణలు లేని ప్రాజెక్టులు ఒక్కటి కూడా లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రధాని మోదీ.

వరంగల్ హన్మకొండ బహిరంగ సభ.. బీఆర్ఎస్ కు.. కేసీఆర్ కు ట్రైలర్ మాత్రమే అంటూ రాబోయే రోజుల్లో రాజకీయం ఎలా ఉండబోతుంది అనేది బహిరంగంగానే చెప్పేశారు మోదీ. 

వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను ఓడించి తీరతామని.. బీజేపీ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు ప్రధాని మోదీ..