తెలంగాణలో అవినీతి లేని ప్రాజెక్టు లేదు : మోదీ

చారిత్రక వరంగల్ కు రావడం సంతోషంగా ఉందని మోడీ తెలుగులో చెప్పారు . వరంగల్ లో ఏర్పాటు చేసిన బీజేపీ విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. బీజేపీకి రెండు సీట్లు ఉన్నప్పుడు  ఒకటి గెలిచింది హనుమకొండలోనే అని గుర్తుచేశారు. 2021 వరంగల్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ కు బీజేపీ ట్రైలర్ చూపించదన్న మోదీ... వచ్చే ఎన్నికల్లో సినిమా చూపిస్తుందని  వెల్లడించారు.  తెలంగాణ అభివృద్ధికి కేంద్రం గత 9 ఏళ్లుగా శక్తివంచన లేకుండా కృషి చేస్తుందన్న మోదీ..  దేశ అభివృద్ధిలో తెలంగాణ పాత్ర కీలకమని చెప్పారు.  

గత 9 ఏళ్లలో కేసీఆర్ ప్రభుత్వం నాలుగే పనులు చేసిందన్నారు మోదీ. పొద్దున లేస్తే  పడుకునే వరకు తనను, కేంద్రాన్ని తిట్టడమ  పని అన్నారు.  రెండోది కుంటుంబ పార్టీని పోషిచడం, మూడోది అర్థిక వ్యవస్థను నాశనం, నాలుగోది తెలంగాణను అవినీతిలో మునిగేలా చేశారన్నారు.   కేసీఆర్ ప్రభుత్వం అంటేనే అత్యంత అవినీతి ప్రభుత్వం అని మోదీ ఆరోపించారు. తెలంగాణలో అవినీతి లేని ప్రాజెక్టు లేదని చెప్పారాయన. TSPSC స్కామ్ గురించి అందరికీ తెలుసున్నారు. కేసీఆర్ అవినీతిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు గురిపెట్టాయని మోదీ వెల్లడించారు.  దళితులను, బలహిన వర్గాలను  కేసీఆర్ ప్రభుత్వం అణిచివేసిందని అన్నారు.  

కాంగ్రెస్ అవినీతి దేశమంతా, బీఆర్ఎస్ అవినీతి రాష్ట్రమంతా తెలుసునన్నారు మోడీ .   వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ తుడిచి పెట్టుకుపోతాయని చెప్పారు.   ఈ సభకును వచ్చిన జనాన్ని చూస్తుంటే తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని నమ్మకం కలుగుతుందని తెలిపారు.