తమిళనాడులో కొత్తగా 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు
చెన్నై: తమిళనాడులో 11 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రధాని మోడీ ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీటిని ప్రారంభించారు. సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీం కొంద ఏర్పాటు చేసిన కొత్త మెడికల్ కాలేజీల ద్వారా 1450 సీట్లు అందుబాటులోకి రానున్నాయి. వీటన్నింటినీ జిల్లా లేదా రిఫరల్ హాస్పిటల్స్ కు అటాచ్ చేయనున్నారు. కొత్త కాలేజీలను విరుధు నగర్, నమక్కల్, ది నీల్ గిరీస్, తిరుప్పూర్, తిరువల్లూరు, నాగపట్టణం, దిండిగుల్, కల్లకురిచి, అరియలూరు, రామంతపుపం, క్రిష్టగిరి జిల్లాల్లో నిర్మించారు. రూ.4వేల కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ భవనాల కోసం రూ.2,145 కోట్లను కేంద్రం ఇవ్వగా.. మిగిలిన మొత్తాన్ని తమిళనాడు ప్రభుత్వం భరించింది.
11 కాలేజీలతో పాటు చెన్నైలోని సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ కొత్త క్యాంపస్ ను కూడా ప్రధాని ప్రారంభించారు. ఇందులో సంప్రదాయ భాషలు, భారతీయ సంస్కృతిని పరిరక్షించే కోర్సులు నేర్పించనున్నారు. పూర్తిగా కేంద్ర నిధులతో నిర్మించిన సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ క్లాసికల్ తమిళ్ క్యాంపస్ కోసం రూ.24 కోట్లు ఖర్చు చేశారు.
PM Narendra Modi inaugurates 11 new government medical colleges in Tamil Nadu, through video conference pic.twitter.com/PdZq9VHZAz
— ANI (@ANI) January 12, 2022
మరిన్ని వార్తల కోసం..