మోడీతో బ్యాడ్మింటన్ బృందం భేటీ

మోడీతో బ్యాడ్మింటన్ బృందం భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో బ్యాడ్మింటెన్ బృందం భేటీ అయ్యింది. ఇటీవలే జరిగిన థామస్ కప్ సాధించి భారత బ్యాడ్మింటెన్ చరిత్రలో సువర్ణధ్యాయం లిఖించిన సంగతి తెలిసిందే. 14 సార్లు టైటిల్ సాధిస్తూ రికార్డులు సృష్టించిన ఇండోనేషియాను చిత్తుగా ఓడించి టైటిల్ నెగ్గింది. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు.. పలువురు ప్రముఖులు బ్యాడ్మింటెన్ క్రీడాకారులకు అభినందనలు తెలియచేశారు. ఈ క్రమంలో.. 2022, మే 22వ తేదీ ఆదివారం బ్యాడ్మింటెన్ బృందం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ట్విట్టర్ లో ఫొటోలు పోస్టులు చేశారు. ఆటగాళ్లతో పాటు ప్రధాన కోచ్ పుల్లెల గోపీచంద్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా క్రీడాకారులతో ప్రధాని అప్యాయంగా ముచ్చటించి అభినందించారు. మెగా ఈవెంట్ లో తమ అనుభవాలను ఆయనకు వివరించారు క్రీడాకారులు.

ప్రపంచ బ్యాడ్మింటెన్ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా థామస్ కప్ ను భావిస్తారు. ఒక్కసారైనా కప్ సాధించాలని వివిధ దేశాల బ్యాడ్మింటెన్ క్రీడాకారులు భావిస్తుంటారు. 1979 తర్వాత ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న భారత్ కనీసం సెమీస్ కూడా చేరలేదు. 2022 సంవత్సరంలో జరిగిన భారత షటర్లు అద్బుతం చేశారు. ప్రత్యర్థులను మట్టి కరిపిస్తూ.. ఫైనల్ వరకు చేరుకుంది. పతకం చేజిక్కించుకోవాలని ఎంతో మంది అభిమానులు ఆశించారు. వారి ఆశలను ఏ మాత్రం వమ్ము చేయకుండా భారత బ్యాడ్మెంటన్ క్రీడాకారులు ఉత్సాహంతో ఆడారు. కిదాంబి శ్రీకాంత్, సాత్విక్, సాయిరాజ్ లు విజయంలో ప్రధాన పాత్ర పోషించారు. ఇండోనేషియాను ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. మూడు విజయాలతో ట్రోఫీని చేజిక్కించుకుంది. 



మరిన్ని వార్తల కోసం : -

ఢిల్లీపై ముంబై గెలుపుతో ఆర్సీబీ సంబరాలు


పంత్ పై ట్రోలింగ్: ఔటైనా రివ్య్వూ తీసుకోలే.. క్యాచ్ వదిలేసిండు..!