ప్రధానమంత్రి టూర్ కి ఏర్పాట్లు షురూ : ఎంపీ అర్వింద్

వచ్చే నెల 3న ప్రధానమంత్రి నరేంద్రమోదీ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. నగరంలోని గిరిరాజ్ కాలేజీ గ్రౌడ్​లో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో సభకు వచ్చిన వారు వర్షానికి తడవకుండా భారీ వాటర్​ ప్రూఫ్​టెంట్​ వేస్తున్నారు. 

శుక్రవారం ఎంపీ అర్వింద్, సీపీ సత్యనారాయణ, పోలీసు ఉన్నతాధికారులు ఏర్పాట్లను పరిశీలించారు. ప్రధానమంత్రి కార్యాలయ సిబ్బంది సైతం తనిఖీ చేశారు.  భద్రతా పరమైన పొరపాట్లు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని అర్వింద్​ సూచించారు.