దేశానికి ఉమ్మడి పౌరస్మృతి అవసరం : ప్రధాని మోడీ

దేశానికి యూనిఫాం సివిల్ కోడ్, ఉమ్మడి పౌరస్మృతి అవసరముందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఈ విషయంలో ముస్లింలను కొన్ని రాజకీయ పార్టీలు అనవసరంగా రెచ్చగొడుతున్నాయని మండిపడ్డారాయన. జూన్ 27వ తేదీ మంగళవారం మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు మోడీ. ఈ సందర్భంగా  ఆయన  ‘మేరా బూత్‌-సబ్‌ సే మజ్‌బూత్‌’ పేరుతో నిర్వహించిన భోపాల్‌ బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. బీజేపీకి కార్యకర్తలే ముఖ్యమన్నారు. బూత్‌ లెవెల్‌ కార్యకర్తలతో సమావేశం కావడం ఆనందంగా ఉందన్నారు పీఎం మోడీ.

ALSO READ:వాగులో ఈత కొడుతూ వినూత్న రీతిలో నిరసన

బీజేపీ కార్యకర్తలకు పార్టీ కంటే దేశం ముఖ్యమన్నారు ప్రధాని మోడీ. పార్టీ అధ్యక్షుడు నడ్డా కృషి తోనే ఇది సాధ్యమయ్యిందన్నారు. మధ్యప్రదేశ్‌కు ఒకే రోజు రెండు వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌లను ప్రారంభించినట్టు చెప్పారు ప్రధాని మోడీ. వర్చువల్‌గా 10 లక్షల మంది కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించడం సంతోషంగా ఉందన్నారాయన.