తెలంగాణ అభివృద్ధికి గడిచిన 9 ఏళ్ల నుంచి కృషి చేస్తున్నామని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. వరంగల్ లో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 15 నిమిషాల పాటు మాట్లాడిన మోడీ.. అందరికీ నమస్కారం అంటూ తెలుగులో స్పీచ్ మొదలుపెట్టారు.
తెలంగాణ కొత్త రాష్ట్రం కావచ్చు.. కానీ దేశ అభివృద్ధిలో దాని పాత్ర గొప్పదన్నారు మోదీ. తెలంగాణలో 6 వేల కోట్ల పెట్టుబడితో రాహదారులను నిర్మిస్తున్నామని వెల్లడించారు. ఇతర రాష్ట్రాలతో తెలంగాణ కనెక్టివిటీ పెంచేందుకు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు.
తెలంగాణలో పెట్టుబడి పెట్టేందుకు చాలా మంది ముందుకు వస్తున్నారని చెప్పిన మోడీ.. మేక్ ఇన్ ఇండియాలో భాగంగా కాజీపేట కూడా భాగం కానుందన్నారు.