డిసెంబర్ 11న వికసిత్​ భారత్ షురూ.. వర్క్​షాపును ప్రారంభించనున్న మోదీ

  • వర్క్​షాప్ ​ప్రారంభించనున్న ప్రధాని నరేంద్ర మోదీ​

న్యూఢిల్లీ: నీతి ఆయోగ్, భారత ప్రభుత్వం సహకారంతో నిర్వహించే ‘వికసిత్​ భారత్​@ 2047’ వర్క్​షాపును ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల రాజ్ భవన్‌‌‌‌‌‌‌‌లలో ఏర్పాటు చేసే వర్క్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లలో యూనివర్సిటీల వైస్-చాన్స్​లర్లు, ఇన్‌‌‌‌‌‌‌‌స్టిట్యూట్‌‌‌‌‌‌‌‌ల అధిపతులు, లెక్చరర్లను ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. దేశానికి సంబంధించిన జాతీయ ప్రణాళికలు, ప్రాధాన్యతలు, లక్ష్యాల రూపకల్పనలో యువ తరాన్ని చురుగ్గా పాల్గొనేలా చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. 2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడానికి యువత ఆలోచనలు,  సూచనలు పంచుకోవడానికి ‘వాయిస్​ ఆఫ్​ యూత్’ థీమ్​తో కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నది.