
జీహెచ్ఎంసీ బీజేపీ కార్పోరేటర్లకు ప్రధాని మోదీ నుంచి పిలుపు అందింది. ఈ మేరకు వారికి ఎల్లుండి సాయంత్రం నాలుగు గంటలకు ప్రధాని అపాయింట్మెంట్ ఇచ్చారు. కార్పొరేటర్ లతోపాటు గ్రేటర్ పరిధిలోని రాష్ట్ర పదాధికారులు ఢిల్లీ వెళ్లనున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కార్పోరేటర్లను వెంటబెట్టుకుని ఢిల్లీకి వెళ్ళనున్నారు. ఈమేరకు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పిఎంవో తో సమన్వయం చేస్తున్నారు.ఇటీవల హైదరాబాద్ పర్యటనలో వర్షం కారణంగా బీజేపీ కార్పోరేటర్లకు తనను కలిసేందుకు టైం ఇవ్వలేకపోయ్యారు ప్రధాని మోడీ. దీంతో ఢిల్లీ రావాల్సిందిగా పిలుపునిచ్చారు.