మోదీ ఇటలీ టూర్ ఖరారు.. జూన్ 13 నుంచి 15వరకు

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించాక మోదీ తొలి విదేశీ పర్యటన ఖరారైంది. జీ7 శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి.. రేపు ఇటలీ వెళ్లనున్నారు ప్రధాని మోదీ. జూన్ 13 నుంచి 15వరకు ఇటలీలోని అపులియా ప్రాంతంలోని G7 సదస్సు జరనుంది. ఈ పర్యటనలో భారత్, ఇటలీ మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై కూడా చర్చించనున్నట్లు తెలిపారు ఇటలీలోని  భారత రాయబారి వాణీ రావు. 

G7 సదస్సుకు ప్రధాని మోదీతో పాటు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, కెనడా, బ్రిటన్, జర్మనీ దేశాల నేతలు హాజరుకానున్నారు.  జూన్ 13,14 తేదీల్లో గ్రూప్ ఆఫ్ సెవెన్ (G7) సమావేశానికి భారత్ ప్రధాని హోదాలో మోదీ హాజరుకానున్నారు. లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక సీట్లు గెలిచిన తర్వాత జార్జియా మెలోని మోదీకి అభినందనలు తెలిపారు. 

G7 సమ్మిట్ 2024  జూన్ 13 నుంచి15 తేదీలలో అపులియాలోని బోర్గో ఎగ్నాజియాలో నిర్వహిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో, బ్రిటన్ ప్రధాని రిషి సునక్, ఫ్రాన్స్‌కు చెందిన ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, జపాన్‌కు చెందిన ఫ్యూమియో కిషిసా మరియు జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్ ఈ కార్యక్రమానికి హాజరవుతారని తెలుస్తోంది.