ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ

 ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన మోదీ

మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు మోదీ.  ఢిల్లీలోని సౌత్ బ్లాక్ కార్యాలయంలో వరుసగా మూడోసారి పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సౌత్ బ్లాక్ సిబ్బంది మోదీకి చప్పట్లతో ఘన స్వాగతం పలికారు.

అనంతరం  పీఎం కిసాన్ నిధి డబ్బులు రిలీజ్ చేస్తూ  ఫైలుపై  మొదటి సంతకం చేశారు మోదీ. దీంతో 20 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో పడనున్నాయి.  ఈ సందర్బంగా మాట్లాడిన మోదీ రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. రైతుల కోసం, వ్యవసాయ రంగం కృషి కోసం మరింత కృషి చేస్తామని చెప్పారు మోదీ. 

ప్రధాని మోదీ జూన్ 10 న సాయంత్రం 5 గంటలకు తొలి కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు.  ఈ భేటీ అనంతరం మంత్రిత్వ శాఖల కేటాయింపు ఉండే అవకాశం ఉంది.

రాష్ట్రపతి భవన్‌లో జూన్ 9 న  మోదీతో పాటు 71మంది   కేంద్రమంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. మంత్రి మండలిలో 30 మంది క్యాబినెట్ మంత్రులు, ఐదుగురు స్వతంత్ర మంత్రులు ఉన్నారు.