108 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మోడీ

మోర్బీ: గుజరాత్ లోని మోర్బీలో నిర్మించిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని పీఎం మోడీ శనివారం వర్చువల్ గా ఆవిష్కరించారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోడీ ఈ భారీ హనుమాన్ విగ్రహాన్ని ఆవిష్కరించి జాతికి అంకితం చేశారు. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశానికి నాలుగు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది. ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.  

మరిన్ని వార్తల కోసం...

హనుమాన్ శోభాయాత్రకు పోలీసుల భారీ బందోబస్తు

వివేక్ అగ్నిహోత్రి గవర్నమెంట్ స్పాన్సర్డ్ ఫిలిం మేకర్