తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ

తిరుమల శ్రీవారిని ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 27వ తేదీన  దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద ప్రధానికి టీటీడీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి, ఈఓ ధర్మారెడ్డి స్వాగతం పలికారు. ప్రధాని హోదాలో మోదీ తిరుమలను సందర్శించడం ఇది నాలుగోసారి.   దాదాపుగా గంటసేపు ఆలయంలోనే మోదీ గడిపారు.  షెడ్యూల్ కంటే ముందే మోదీ శ్రీవారిని దర్శించుకున్నారు.  ప్రధాని పర్యటన నేపథ్యంలో తిరుమలలో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. 

మరోవైపు కార్తీకమాసం సందర్భంగా  తిరమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది.  శ్రీవారి దర్శనం కోసం 18 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.  శ్రీవారి సర్వదర్శానానికి 8 గంటల సమయం పడుతుంది.  నిన్న తిరుమల శ్రీవారిని 70 వేల 350  మంది భక్తులు దర్శి్ంచుకోగా.. హుండి ఆదాయం  రూ.  3.11 కోట్లు వచ్చిందని  టీటీడీ అధికారులు వెల్లడించారు.