మోర్బీ: ప్రధాని మోడీ రేపు గుజరాత్ లో పర్యటించనున్నారు. హనుమాన్ జయంతి సందర్భంగా మోర్బీలో నెలకొల్పిన 108 అడుగుల భారీ హనుమాన్ విగ్రహాన్ని మోడీ ఆవిష్కరించనున్నారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ‘హనుమాన్జీ4ధామ్’ప్రాజెక్ట్ లో భాగంగా దేశ నలు దిక్కుల్లో నాలుగు హనుమాన్ విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా దేశానికి పడమర దిక్కున ఉన్న మోర్బీలోని బాపూ కేశ్వానంద్ ఆశ్రమంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటివరకు ఏర్పాటు చేసిన విగ్రహాల్లో ఇది రెండోది. ఇక మొదటి విగ్రహాన్ని 2010లో ఉత్తరాదిన ఉన్న సిమ్లాలో ఏర్పాటు చేశారు. అలాగే దక్షిణ దిక్కున తమిళనాడులోని రామేశ్వరంలో విగ్రహానికి సంబంధించిన పనులు ప్రారంభించారు.
On the occasion of Hanuman Jayanti,Prime Minister Narendra Modi will unveil a 108 ft statue of Hanuman ji in Morbi, Gujarat on 16 April. This statue is the second of the 4 statues being set up in 4 directions across the country, as part of #Hanumanji4dham project: PMO
— ANI (@ANI) April 15, 2022
(File pic) pic.twitter.com/iYdX1P0yH9
మరిన్ని వార్తల కోసం...
సంజీవనితో మెడికల్ ఉత్పత్తుల్లో స్వయం సమృద్ధి