దేశ ప్రజలకు ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

దేశ ప్రజలకు ప్రధాని మోదీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు

76వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. రాజ్యాంగానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. సంపన్న భారతదేశం కోసం ప్రజాస్వామ్యం, గౌరవం,ఐక్యత ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.

Also Read :- ఢిల్లీలో భారీ భద్రత..ట్రాఫిక్ ఆంక్షలు

గణతంత్ర రాజ్యంగా 75 యేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు జరుపుకుంటున్నాం.. రాజ్యాంగరూపకల్పన, ప్రజాస్వామ్యం అందించిన స్వాతంత్ర సమర యోధులకు స్మరించుకుంటూ ఈ వేడుకలు జరుపుకుందామని ప్రజలకు పిలుపునిచ్చారు.రాజ్యాంగ పరిరక్షణ, దేశాన్ని బలమైన, సుసంపన్నమైన దేశంగా భారత్ తీర్చి దిద్దే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తుందని మోదీ Xలో పోస్ట్ చేశారు.