మనుకు మోదీ ఫోన్‌‌

మనుకు మోదీ ఫోన్‌‌

పారిస్‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌లో బ్రాంజ్ మెడల్ గెలిచిన షూటర్‌‌‌‌‌‌‌‌ మను భాకర్‌‌‌‌‌‌‌‌ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. మెడల్ నెగ్గిన వెంటనే మనుతో మోదీ ఫోన్‌‌‌‌లో మాట్లాడారు. ‘శుభాకాంక్షలు మను.  మీ గెలుపు వార్తతో దేశం మొత్తం మీ విజయ వైభవంలో మునిగిపోయింది. 

కొద్దిలో సిల్వర్ మెడల్ నెగ్గే అవకాశాన్ని చేజార్చుకున్నప్పటికీ దేశం గర్వపడేలా చేశారు.  షూటింగ్‌‌‌‌లో మెడల్ సాధించిన భారత తొలి మహిళగా అవతరించినందుకు అభినందనలు’ అని మనుతో  పీఎం చెప్పారు. ప్రభుత్వం నుంచి అథ్లెట్లకు అందుతున్న సాయానికి మోదీకి కృతజ్క్షతలు తెలిపిన మను.. తన ఫోకస్ ఇప్పుడు 25 మీటర్ల పిస్టల్‌‌‌‌, 10 మీ. పిస్టల్‌‌‌‌ మిక్స్‌‌‌‌డ్‌‌‌‌ టీమ్‌‌‌‌ ఈవెంట్‌‌‌‌పై ఉందని చెప్పింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు ఇతర రాజకీయ, క్రీడా ప్రముఖులు కూడా భాకర్‌‌‌‌ను అభినందించారు.