- పీఎం సెక్యూరిటీ బ్రీచ్ కేసులో విచారణనూ సాగనివ్వం
- సుప్రీంకోర్టు అడ్వొకేట్లకు ఖలిస్తాన్ గ్రూపు బెదిరింపు కాల్స్
న్యూఢిల్లీ: రిపబ్లిక్ డే రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో జెండా ఎగరవేయకుండా అడ్డుకుంటామని ఖలిస్తానీ మూమెంట్ అనుకూల సంస్థ సిఖ్స్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్ జే) మరోసారి హెచ్చరించింది. పంజాబ్లో ప్రధాని పర్యటన సందర్భంగా జరిగిన భద్రతా లోపంపై జస్టిస్ ఇందూ మల్హోత్రా కమిటీ విచారణ సాగనివ్వబోమని చెప్పింది. పలువురు సుప్రీంకోర్టు అడ్వొకేట్లకు ఈమేరకు ఎస్ఎఫ్జే నుంచి రెండోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. మొదటిసారి బెదిరింపు కాల్స్ వచ్చిన తర్వాత అడ్వొకేట్ దీపక్ ప్రకాశ్ ఫిర్యాదు చేయడంతో ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
ఇది మోడీకి, సిక్కులకు మధ్య ఇష్యూ..
‘‘పంజాబ్ లో పీఎం సెక్యూరిటీ బ్రీచ్ ఘటన మోడీకి, సిక్కులకు మధ్య సమస్య. కానీ ఇందులో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల మీ అంతట మీరే ప్రమాదంలో పడ్డారు. సుప్రీంకోర్టు అడ్వొకేట్లు, జడ్జిలు ముస్లింలకు, సిక్కులకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు. వారం కిందట బెదిరింపు కాల్స్, మెసేజ్లపై కేసు పెట్టిన అడ్వొకేట్లు జరిగే పరిణామాలకు బాధ్యత వహించాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టు అడ్వొకేట్ల లిస్టును కూడా మేం తయారు చేస్తాం” అని రికార్డెడ్ ఆడియోను ఫోన్లో వినిపించినట్లు అడ్వొకేట్లు చెప్పారు.