ఇప్పటికైనా అమిత్ షాను మోదీ అదుపులో పెట్టాలి: మమతా బెనర్జీ

ఇప్పటికైనా అమిత్ షాను మోదీ అదుపులో పెట్టాలి: మమతా బెనర్జీ

వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ లో జరిగిన అల్లర్లు  ప్లాన్ ప్రకారమే జరిగాయని ఆ రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ అన్నారు. బంగ్లాదేశ్ దుండగులను రాష్ట్రంలోకి ప్రవేశించడానికి  కేంద్రహోంమంత్రి అమిత్ షా, బీఎస్ఎఫ్ కుట్ర పన్నారని ఆరోపించారు. ఇదే నిజమైతే బెంగాల్  అల్లర్లకు కేంద్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు మమత.

 కోల్ కతాలో ముస్లీం మతాధికారులతో జరిగిన సమావేశంలో మాట్లాడిన మమత.. బెంగాల్ వెంబడి 2,200 కి.మీ బంగ్లాదేశ్ సరిహద్దును కాపాడుతున్న బిఎస్ఎఫ్..  పొరుగు దేశం నుంచి దుండగులను లోపలికి అనుమతించడానికి కారణమని మమత ఆరోపించారు. ఈ విషయంలో బీఎస్ఎఫ్ పాత్రపై దర్యాప్తు చేయాలని కోరారు. 

నేను ప్రధానమంత్రిని కోరుతున్నాను. హోంమంత్రి (అమిత్ షా)ను ఆయన అదుపులో పెట్టాలి. ఆయన అన్ని ఏజెన్సీలను ఉపయోగించి మనపై కుట్రలు పన్నుతున్నారు. మోడీ జీ లేనప్పుడు ఏం జరుగుతుంది? అని మమత అన్నారు. వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా తమ పార్టీ పోరాటం చేయడంతో ముందంజలో ఉందన్నారు. శాంతియుత నిరసనలు చేపట్టాలని ఆమె పిలుపునిచ్చారు. 

►ALSO READ | Supreme Court:సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బిఆర్ గవాయ్

వక్ఫ్ చట్టం అమలుకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల సందర్భంగా బెంగాల్‌లోని ముర్షిదాబాద్ , దక్షిణ 24 పరగణాల జిల్లాల్లో చెలరేగిన హింస వల్ల ముగ్గురు మరణించగా,200 మందికి పైగా గాయపడ్డారు. అల్లర్లలో మరణించిన ముగ్గురికి రూ.10లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.