PM Suraya Ghar: ఉచిత విద్యుత్ పథకంలో రూ.78 వేల వరకు సబ్సిడీ

PM Suraya Ghar: ఉచిత విద్యుత్ పథకంలో రూ.78 వేల వరకు సబ్సిడీ

న్యూఢిల్లీ:దేశవ్యాప్తంగా సౌరశక్తిని ప్రోత్సహించేందుకు రూ.75వేల కోట్ల భారీ పెట్టుబడితో పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్నికేంద్రప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ స్కీం కింద ఆకర్షణీయమైన సబ్సిడీని ఇస్తోంది. కోటి గృహాలకు సౌర విద్యుత్ అందించే లక్ష్యంతో ఈ సబ్సిడీని అందిస్తోంది.

ఈ స్కీం ప్రకారం.. నెలవారి విద్యుత్ వినియోగం 1-2W మధ్య అంటే 0-150 యూనిట్ల మధ్య ఉన్న వినియోగదారులకు రూ.30వేల నుంచి రూ.60 వేల వరకు సబ్సిడీ ఉంటుంది.  అదనంగా 1KW కావాలంటే  అదనంగా రూ.18వేల సబ్సిడీ ఇస్తోంది.  నెలకు 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగాన్ని కలిగి ఉన్న గృహాలు 3 kW కంటే ఎక్కువ సిస్టమ్‌లను ఇన్‌స్టాల్ చేసుకునేలా ప్రోత్సహించబడ్డాయి, గరిష్ట సబ్సిడీ ₹78,000.

మిలియన్ల కొద్ది భారతీయ గృహాలకు విద్యుత్ ఖర్చులు తగ్గించడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం వంటి ప్రయోజనంతో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ మేరకు ప్రధాని మోదీ ఓ ట్వీట్ చేశారు. ‘స్థిరమైన అభివృద్ధి , ప్రజల శ్రేయస్సు కోసం  సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాం. రూ. 75 వేల కోట్ల ఖర్చుతో ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించడం ద్వారా కోటి గృహాల్లో వెలుగులు నింపడం లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. 

ఈ పథకం కోసం దరఖాస్తులు ఆన్ లైన్ చేసుకోవచ్చు. https://pmsuryaghar.gov.inలో  రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.