పీఎంసీ ఖాతాదారులు లావాదేవీలకు సంబంధించి తీవ్ర భయాందోళనలతో ఉన్నారు. ఎందుకు భయపడ్డారంటే…
- ఈ ఏడాది సెప్టెంబర్ 24న ముంబైలోని పీఎంసీని ఆర్నెల్ల పాటు కంట్రోల్లో పెడుతున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. అంటే.. ఆ బ్యాంకు రెగ్యులర్ లావాదేవీలపై అన్ని నిర్ణయాలు ఆర్బీఐ తీసుకుంటుందన్నమాట. పీఎంసీకి ఎలాంటి అధికారం ఉండదు. డైరెక్టర్ల బోర్డు రద్దవుతుంది. పీఎంసీ కస్టమర్లు ఇకపైన తమ ఖాతా నుంచి వెయ్యి రూపాయలకు మించి విత్ డ్రా చేసుకోలేరు. ఆర్నెల్లపాటు ఈ రూల్ అమల్లో ఉంటుంది. ముంబైలోని పీఎంసీ బ్రాంచీలకు పరుగులు తీశారు. ఖాతాదారుల్లో ఎక్కడ చూసినా పానిక్ సిట్యుయేషన్. చాలాచోట్ల బ్యాంకు సిబ్బంది గాయబ్ అయ్యారు. కొన్ని బ్రాంచీలకు అసలు తాళమే తియ్యలేదు. పీఎంసీ ఏటీఎంలకు షట్టర్లు ఎత్తలేదు. అన్ని బ్రాంచీల దగ్గర పెద్ద ఎత్తున పోలీసు సెక్యూరిటీ.
- మొదటిరోజు వెయ్యి రూపాయలు విత్ డ్రా లిమిట్ పెట్టి, ఖాతాదారులు గగ్గోలు పెట్టడంతో పదివేలకు పెంచారు. ప్రస్తుతం ఈ లిమిట్‌ను 25 వేలకు పెంచడంతో కస్టమర్లు శాంతించారు.
- ఆరోగ్య కారణాలను స్పష్టంగా చూపించగలిగితే మాత్రం ఆర్బీఐ వెసులుబాటు కల్పిస్తుంది. కేసు సిన్సియర్ అని రుజువు చేసుకోవాలి.
- ఆర్బీఐ ఆంక్షలు ఉన్న ఏ బ్యాంకయినా కొత్త డిపాజిట్లు తీసుకోలేదు. అలాగే, కొత్తగా లోన్లు శాంక్షన్ చేసే పవర్ ఉండదు.
- అకౌంట్ హోల్డర్లు పీఎంసీ నుంచి ఇతర బ్యాంకు ఖాతాలకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేయలేరు. మనీ ట్రాన్స్ఫర్కి ఆర్బీఐ రూల్స్ ఒప్పుకోవు. పెన్షన్ మీద బతికే సీనియర్ సిటిజన్లకు కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయి.
- సరే, ఆర్నెల్ల తరువాత ఏం జరగొచ్చు? ఆర్బీఐ రూల్ బుక్ ప్రకారం ఆంక్షలను సడలించవచ్చు. లేదా ఎత్తేయవచ్చు. ఆర్బీఐకి నమ్మకం కుదరకపోతే మరికొంతకాలం కంటిన్యూ చేయవచ్చు.
- గురువారం ముంబై టూర్‌కు వెళ్లిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను ఖాతాదారులు కలవగా, ఆర్బీఐ గవర్నర్‌తో మాట్లాడతానని ఆమె భరోసా ఇచ్చారు.