అమ్మకాలు, ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల.. నెమ్మదించిన సేవల రంగం వృద్ధి

అమ్మకాలు, ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల.. నెమ్మదించిన సేవల రంగం వృద్ధి

న్యూఢిల్లీ: అమ్మకాలు, ఉత్పత్తిలో స్వల్ప పెరుగుదల కారణంగా జనవరిలో మన దేశ సేవల రంగం కార్యకలాపాలు గత రెండు సంవత్సరాలలో ఎన్నడూ లేనంత  తక్కువ వేగంతో విస్తరించాయని బుధవారం ఒక నెలవారీ సర్వే తెలిపింది. కాలానుగుణంగా మారే హెచ్ఎస్​బీసీ ఇండియా సర్వీసెస్ పీఎంఐ బిజినెస్​యాక్టివిటీ ఇండెక్స్ డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌లో 59.3 నుంచి జనవరిలో 56.5కి పడిపోయింది. గత నవంబర్ తర్వాత ఇది అత్యల్ప స్థాయి. పర్చేజింగ్​మేనేజింగ్​ఇండెక్స్​(పీఎంఐ) 50 కంటే ఎక్కువ ఉంటే  సానుకూలంగా ఉన్నట్టు. లేకపోతే తక్కువగా ఉన్నట్టు భావిస్తారు.

"జనవరిలో భారత సేవల రంగం వృద్ధి ఊపును కోల్పోయింది. అయినప్పటికీ పీఎంఐ 50 -బ్రేక్- ఈవెన్ స్థాయి కంటే చాలా ఎక్కువగా ఉంది. వ్యాపార కార్యకలాపాలు,  కొత్త వ్యాపార పీఎంఐ సూచికలు వరుసగా నవంబర్ 2022, నవంబర్ 2023 తర్వాత అత్యల్ప స్థాయికి తగ్గాయి" అని హెచ్ఎస్బీసీలో చీఫ్ ఇండియా ఎకనామిస్ట్ ప్రాంజుల్ భండారి అన్నారు.