మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం : తరాల జగదీశ్

మోడల్ స్కూల్ టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటం : తరాల జగదీశ్
  • పీఎంటీఏ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సమస్యల పరిష్కారానికి దశల వారీగా ఆందోళనలు చేపడతామని ప్రోగ్రెసివ్ మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ (పీఎంటీఏ) రాష్ట్ర అధ్యక్షుడు తరాల జగదీశ్ తెలిపారు. సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 12 నుంచి 17 వరకు నల్లబ్యాడ్జీలతో లంచ్ టైమ్​లో నిరసనలు, 18న మండల స్థాయి అధికారులకు వినతి పత్రాలు,  డిసెంబర్ 19,20 తేదీల్లో డీఈఓలు, డీఐఈఓలకు, 21 నుంచి 23 వరకూ ఎమ్మెల్యేలు, ఎంపీలకు వినతి పత్రాలు ఇవ్వనున్నట్టు వెల్లడించారు. 28న ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఒకరోజు దీక్షలు చేపతామని, సర్కారు స్పందించకపోతే జనవరి 4న హైదరాబాద్​లో మహాధర్నా చేపడతామని హెచ్చరించారు.