
న్యూఢిల్లీ: హౌసింగ్, ఆటో, ఎడ్యుకేషన్, పర్సనల్ లోన్లపై వడ్డీని 25 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించినట్టు పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) ప్రకటించింది. ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేట్లను తగ్గించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. వివిధ పథకాల కింద ఇచ్చిన హోం లోన్లపై వడ్డీని పీఎన్బీ 8.15 శాతానికి తగ్గించింది. ముందస్తు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంట్ల చార్జీలపై వచ్చే నెల 31 వరకు మినహాయింపు ఉంటుంది. ఆటో లోన్లపై వడ్డీ 8.5 శాతం నుంచి మొదలవుతుంది. 120 నెలల్లోపు లోన్‌ను చెల్లించాలి.