
- శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్‌కు షిఫ్ట్
ఎల్ బీనగర్, వెలుగు : పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఎల్బీనగర్ బ్రాంచ్‌ను శివగంగ కాలనీ నుంచి మన్సూరాబాద్ మెయిన్ రోడ్వైపు షిఫ్ట్ చేశామని.. కస్టమర్లు తమ సేవలను వినియోగించుకోవాలని హైదరాబాద్ జోనల్ హెడ్ దీపక్ కుమార్ తెలిపారు. బుధవారం పంజాబ్ నేషనల్ ఎల్ బీనగర్ బ్రాంచ్ షిఫ్టింగ్ సందర్భంగా దీపక్ కుమార్ మాట్లాడుతూ..
మా కస్టమర్ల సేవలు తమకు ఎంతో ముఖ్యమన్నారు. ఎఫ్డీ, ఆర్డీ, యూపీఐ సేవలను కస్టమర్లు ఉపయోగించుకోవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో హైదరాబాద్ సర్కిల్ హెడ్ ఎన్వీఎస్పీ రెడ్డి, ఎల్ బీనగర్ బ్రాంచ్ మేనేజర్ వెంకన్న పాల్గొన్నారు.