గిరిజన గ్రామాల్లో సొసైటీలు ఏర్పాటు చేయండి : ప్రతీక్​జైన్

  •     ఫిషరీస్ ఆఫీసర్లకు పీవో ఆదేశాలు

భద్రాచలం, వెలుగు :  భద్రాద్రికొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్​బాద్, ములుగు జిల్లాల పరిధిలోని ఏజెన్సీ ఏరియాల్లోని చెరువుల్లో చేపల పెంపకం చేపట్టేందుకు ఆదివాసీలతో సొసైటీలు ఏర్పాటు చేయాలని పీవో ప్రతీక్​జైన్​ ఆదేశించారు. గురువారం భద్రాచలంలోని తన చాంబరులో నాలుగు జిల్లాల ఫిషరీస్​ ఆఫీసర్లతో ఆయన స్పెషల్ మీటింగ్​ ఏర్పాటు చేశారు. చెరువులు, చేప పిల్లల విడుదల, ఉత్పత్తి గురించి వారితో రివ్యూ చేశారు.

అన్ని చెరువులకు సొసైటీలు తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు.  పీసా గ్రామసభల ద్వారా చెరువులపై ఆదివాసీలకు హక్కులు కల్పించాలని సూచించారు. ఈ మీటింగ్​లో ఏపీవో జనరల్ డేవిడ్​రాజ్​, ఎఫ్​డీవో అశోక్, నాలుగు జిల్లాల ఫిషరీస్​ఆఫీసర్లు, ఎస్​వో సురేశ్​కుమార్, డీఎస్​వో ప్రభాకర్​ పాల్గొన్నారు.