భద్రాచలం,వెలుగు: విద్యార్ధుల సామర్ధ్యాలను వెలికితీసేందుకు, టీచర్లకు ఉపయోగపడేందుకు ప్రత్యేకంగా యాప్‌ను రూపొందిస్తున్నట్లు ఐటీడీఏ పీవో ప్రతీక్‌జైన్ చెప్పారు. భద్రాచలం ఐటీడీఏలో ఖమ్మం జిల్లాలోని గురుకులం, ఆశ్రమ పాఠశాలల ప్రిన్సిపల్స్, హెచ్ఎంలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్ధుల సామర్ధ్యాలను అంచనా వేసేందుకు వారికి పలు సూచనలు చేశారు. 2021లో వచ్చిన కరోనా కారణంగా విద్యార్ధులు కొంత వెనుకబడ్డారని అన్నారు.
పిల్లలకు ఇష్టం పెరిగేలా చదువు చెప్పాలన్నారు. ఒక్కో టీచర్‌కు 50 మంది విద్యార్ధులను కేటాయిస్తామని, వారంతా యాప్‌లో సూచించిన పద్దతుల్లో బోధన చేయాలని తెలిపారు. పదో తరగతి పిల్లలకు వంద రోజుల ప్రణాళిక రూపొందించి కమిషనరేట్ నుంచి మెటీరియల్ సరఫరా చేస్తున్నారని, దాని ప్రకారం వారిని పరీక్షలకు సిద్ధం చేయాలన్నారు. ఏపీవో జనరల్ డేవిడ్‌రాజ్, డీడీ మణెమ్మ తదితరులు పాల్గొన్నారు.