
- కొండగొర్రెను వదిలేసి పరారైన వేటగాళ్లు
- వరంగల్ జిల్లా పాకాల చెరువు వద్ద ఘటన
నర్సంపేట, వెలుగు: పాకాల అభయారణ్యంలో వణ్యప్రాణులను వేటాడి ఆటోలో తీసుకెళ్తుండగా జరిగిన ప్రమాదంలో కొండగొర్రెను వదిలేసి వేటగాళ్లు పరారైన ఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఆదివారం ఉదయం నర్సంపేట నుంచి కొత్తగూడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సు పాకాల చెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురు వ్యక్తుల్లో ఒకరికి గాయాలు అయ్యాయి.
చనిపోయిన కొండ గొర్రె కిందపడిపోగా వదిలేసి, అడవి పంది మాంసంతో ఆటోలో పరార్ అయ్యారు. దీంతో ఆర్టీసీ డ్రైవర్పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, ఫారెస్టు ఆఫీసర్లు వెళ్లి కేసు నమోదు చేశారు. వేటగాళ్లను గుర్తించినట్టు ఎఫ్ఆర్వోఓ రవికిరణ్ చెప్పారు.
నిందితుల్లో ముగ్గురు ఖానాపురం మండలం చిలకమ్మనగర్, అశోక్‌నగర్‌కు చెందిన ఒకరు, మొండ్రాయి గూడెంకు చెందిన ఒకరు ఉన్నారని తెలిపారు. కాలికి గాయమైన వ్యక్తి వరంగల్ఎంజీఎంలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నట్లు తెలిసిందని పేర్కొన్నారు. నిందితులను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరుస్తామని ఆయన వివరించారు.