జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం అంబారీపేట్గ్రామంలో దారుణం జరిగింది. వరి నాట్ల కోసం వెళ్లిన ఓ రైతు డెడ్‌బాడీ నుజ్జునుజ్జు కావడం కలకలం రేపింది. గ్రామానికి చెందిన ముడి మడుగుల పోశయ్య (50) తనకున్న 20 గుంటల పొలం దున్నేందుకు ట్రాక్టర్ అవసరం ఉండగా.. అదే గ్రామానికి చెందిన జాడి బాణయ్యను పిలిచాడు. పొలం దున్నుతున్న క్రమంలో ట్రాక్టర్కేజ్వీల్స్ కింద పడి పోశయ్య చనిపోయాడు.
పోశయ్య ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అంతటా వెతికారు. అర్ధరాత్రి సమయంలో పొలం మడిలో పేగులు, రక్తం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. డ్రైవర్ తాగి ట్రాక్టర్ నడపడంతో జరిగిన ప్రమాదాన్ని కప్పిపుచ్చుకునేందుకు శవాన్ని మాయం చేయాలనే ఉద్దేశంతో కేజీవీల్స్ తో నుజ్జునుజ్జు అయ్యేలా చేశాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ట్రాక్టర్డ్రైవర్ను అదుపులోకి తీసుకుని దర్యాప్తుచేస్తున్నారు.