అమ్మా పోచమ్మ తల్లి .. పాలు తాగుతున్న దేవత

 అమ్మా పోచమ్మ తల్లి ..  పాలు తాగుతున్న దేవత

భక్తులు సమర్పించిన పాలను పోచమ్మతల్లి దేవత  తాగుతున్న అరుదైన, అద్భుతమైన ఘట్టం శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని మదీనాగూడాలో చోటుచేసుకుంది. మదీనాగూడా గ్రామంలోని పోచమ్మ అమ్మవారి దేవాలయం ఉంది. స్వయంభూవుగా వెలసిన పోచమ్మతల్లి అమ్మవారికి ఇక్కడి స్థానికులు నిత్యపూజలు చేస్తున్నారు. 

అయితే గత మూడు రోజులుగా అమ్మవారు భక్తులు సమర్పించిన పాలు తాగుతున్నట్లు ఆలయ పూజారి నవీన్ కుమార్ తెలిపారు. ఇదే విషయం ఆలయ కమిటీ వారికి తెలుపగా వారు శుక్రవారం ఉదయం స్వయంగా అమ్మవారికి చెంచాతో పాలు పట్టించారు. అమ్మవారు పాలును స్వీకరించినట్లు గుర్తించి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దీనంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా వైరల్ గా మారింది. 

Also Read:బూత్ వైస్ ఓటింగ్ డేటా వెబ్‌సైట్‌లో పెట్టడం కుదరదు 

ఈ విషయం తెలుసుకున్న భక్తులు పోచమ్మ తల్లి దేవాలయానికి బారులు తీరారు. ఉదయం నుండి అమ్మవారికి భక్తులు పాలు సమర్పిస్తూనే ఉన్నారు. ఈ అద్భుత ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తూ పూజలు చేస్తున్నారు. తమ కొరికలను తీర్చాలంటూ మొక్కుతున్నారు.