చొప్పదండి, వెలుగు: చొప్పదండి పట్టణంలోని మాల సామాజికవర్గం, ఆర్నకొండలో శాలివాహన(కుమ్మరి) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పోచమ్మ బోనాల వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకొని బైండ్ల డప్పుల చప్పులతో ఆటపాటలాడుతూ పోచమ్మ గుడికి చేరుకొని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో మాల, కుమ్మరి సామాజిక సంఘం నాయకులు, మహిళలు పాల్గొన్నారు.
కోరుట్ల, వెలుగు: కోరుట్లలో మాదిగ, మాల కులసంఘాల ఆధ్వర్యంలో ఆదివారం మారెమ్మ తల్లికి బోనాలు నిర్వహించారు. తెలంగాణ ప్రజాసంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు పేట భాస్కర్ మారెమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు.