దహెగాం మండల కేంద్రంలో ఘనంగా పోచమ్మ బోనాలు

దహెగాం మండల కేంద్రంలో పోచమ్మ బోనాలు ఘనంగా నిర్వహించారు. పోచమ్మ,భూలక్ష్మి, బొడ్రాయి, నవగ్రహాల ప్రతిష్ఠాపన తొలి వార్షికోత్సవం సందర్భంగా బుధవారం నిర్వహించిన ఉత్సవాల్లో గ్రామస్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. 

డప్పు చప్పుళ్ల మధ్య బొడ్రాయి నుంచి ఊరేగింపుగా పోచమ్మ గుడి దగ్గరకు వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. శివసత్తులు, పోతరాజు విన్యాసాలు ఆకట్టుకున్నాయి.     

 దహెగాం, వెలుగు