బాల్కొండ, వెలుగు : మెండోరా మండలం పోచంపాడ్ సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ ను అడిషనల్ కలెక్టర్ అంకిత్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. మెనూ ప్రకారం భోజనం అందిస్తున్నారా లేదా అని ఆరా తీశారు. స్టూడెంట్స్ ను అడిగి వివరాలు తెలుసుకుని, విద్యా ప్రమాణాలు మెరుగుపర్చుకోవాలన్నారు. హాస్టల్ లో పారిశుద్ధ్యం పక్కాగా నిర్వహించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
డార్మెటరీ లైట్లు పనిచేయకపోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. స్టూడెంట్స్ ఆరోగ్యం పై స్పెషల్ కేర్ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో వనజ, ఎమ్మార్వో సంతోష్ రెడ్డి, హాస్టల్ ప్రిన్సిపాల్ గోదావరి, ఎంపీవో భరత్ చంద్ర తదితరులు పాల్గొన్నారు.