జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. చెరువుల బఫర్ జోన్లో అనురాగ్ యూనివర్సటీ నిర్మించారని ఫిర్యాదు చేశారు ఇరిగేషన్ అధికారులు. మేడ్చల్ జిల్లాలోని వెంకటాపురం, నాదం చెరువుల బఫర్ జోన్లలో అనురాగ్ యూనివర్సటీ నిర్మించారని పోచారం ఐటీ కారిడార్ పీఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. ఇరిగేషన్ శాఖ అధికారుల ఫిర్యాదుతో BRSఎమ్మెల్యే పల్లారాజేశ్వర్ రెడ్డిపై కేసు నమోదు చేశారు పోలీసులు.
ALSO READ : N కన్వెన్షన్ కూల్చివేతపై కోర్టుకు వెళతా : హీరో నాగార్జున
మరో వైపు రాష్ట్ర వ్యాప్తంగా అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా ఝులిపిస్తోంది. ఎఫ్ టీఎల్, బఫర్ జోన్ పరిధిలో రూల్స్ కు విరుద్ధంగా మాదాపూర్ లో నాగార్జున ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను హైడ్రా కూల్చివేసిన సంగతి తెలిసిందే.