
బాన్సువాడ, వెలుగు : బాన్సువాడ పట్టణంలోని ఎమ్మెల్యే స్వ గృహంలో ఆదివారం ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు. బాన్సువాడ నియోజకవర్గ పరిధిలోని నసురుల్లాబాద్ మండలానికి చెందిన డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ బిల్లు చెక్కులు, అదే మండలానికి చెందిన నలుగురికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు.