బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. బాన్సువాడలో పెండింగులో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్ల పెండింగ్ బిల్లులు ఇవ్వకపోతే అమరణ నిరాహారదీక్ష చేస్తానన్నారు. అవసరమైతే ప్రాణత్యాగం చేస్తానని వ్యాఖ్యానించారు.
నిజామాబాద్ జిల్లా పోతంగల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోల్ పాల్గొన్న పోచారం శ్రీనివాస్ రెడ్డి. డబుల్ బెడ్రూం లబ్దిదారులకు ఇంకా రూ 26 కోట్లు రావాలన్నారు. మంత్రికి చెప్పిన పట్టించుకోలేదన్నారు. ఇక్కడ కొంత మంది కాంగ్రెస్ నాయకులు బిల్లులు రాకుండా ఆడ్డుకుంటున్నారని ఆరోపించారు.
తనను నమ్ముకుని అప్పులు చేసి ఇండ్లు కట్టుకున్న పేదల బాధ చూడలేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత డబ్బులు ఇవ్వకపోతే కలెక్టర్ కార్యాలయం ముందు లబ్ధి దారులు, తన భార్యతో పాటు ధర్నా చేస్తామన్నారు. వినక పోతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని హెచ్చరించారు.