కరోనా బారిన స్పీకర్ పోచారం

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయనే తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేశారు. రెగ్యులర్ మెడికల్ టెస్టులలో భాగంగా నిన్న రాత్రి చేయించిన కోవిడ్ టెస్ట్ లో తనకు కరోనా పాజిటివ్ గా తేలిందని ఆయన తెలిపారు. ప్రస్తుతం తనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనప్పటికీ.. డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని AIG  హాస్పిటల్ లో జాయిన్ అయినట్లు పోచారం తెలిపారు. 

గత కొన్ని రోజుల నుంచి తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్ లో ఉండాలని ఆయన సూచించారు. కాగా.. నాలుగు రోజుల కిందటే పోచారం తన మనవరాలి పెళ్లి ఘనంగా జరిపించారు. ఈ వివాహానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ల సీఎంలిద్దరూ హాజరవడం గమనార్హం.