![బాన్స్వాడ బరిలో ఎవరు?](https://static.v6velugu.com/uploads/2023/08/Pocharam-Srinivas-Reddy_OkzpbKUWTJ.jpg)
- స్పీకర్‌గా తనకివి ఆఖరి అసెంబ్లీ సెషన్స్ అంటూ పోచారం శ్రీనివాస్ రెడ్డి భావోద్వేగం
- వచ్చే ఎన్నికల్లో వారసుడిని బరిలో దింపుతారనే ప్రచారం
- సభలో తానున్నన్ని రోజులు శీనన్న ఉంటారని గతంలో సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు
- కామారెడ్డి జిల్లాలో జోరుగా చర్చ
కామారెడ్డి, వెలుగు : వచ్చే గవర్నమెంట్లో కొత్త స్పీకర్వస్తారంటూ అసెంబ్లీ సమావేశాల చివరి రోజు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎమోషన్‌కు గురికావడం కామారెడ్డి జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఎన్నికల్లో పోచారం శ్రీనివాస్‌రెడ్డి పోటీచేయకపోవచ్చని, ఆయన తన వారసుడిని బరిలో నిలిపే అవకాశముందని కొద్దిరోజులుగా బాన్స్వాడ నియోజకవర్గంలో చర్చ జరుగుతోంది. ఇందుకు తగ్గట్లే అసెంబ్లీ సమావేశాల చివరిరోజైన ఆదివారం ఆయన ఈ విషయాన్ని ప్రస్తావించారని ఆయన అనుచరులు అంటున్నారు. ఈ ఏడాది మార్చి 1న బాన్స్వాడ నియోజకవర్గం తిమ్మాపూర్‌లోని వేంకటేశ్వరస్వామి కల్యాణానికి సీఎం కేసీఆర్ వచ్చారు. అక్కడ సీఎం మాట్లాడుతూ.. సభలో తానున్నన్ని రోజులు శీనన్న బరిలో ఉంటారని , వయస్సు ఏమి అడ్డు రాదని కామెంట్స్చేశారు. కానీ, పోచారం శ్రీనివాస్‌రెడ్డికి కొంతకాలంగా ఇంటిపోరు ఎక్కువైంది.
ఆయన ఇద్దరు కొడుకులు పోచారం భాస్కర్‌రెడ్డి, పోచారం సురేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈక్రమంలోనే శ్రీనివాస్‌రెడ్డి స్థానంలో ఆయన వారుసుడు బాన్స్వాడలో పోటీ చేయవచ్చనే ప్రచారం జరిగింది. కానీ, కేసీఆర్మాటలతో ఈ ప్రచారం ఆగిపోయింది. ప్రస్తుతం పోచారం పెద్దకొడుకు భాస్కర్‌రెడ్డి ఉమ్మడి నిజామాబాద్ డీసీసీబీ చైర్మన్ గా ఉన్నారు. ఈసారి ఆయనకే టికెట్ఇప్పించాలని ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఒత్తిడి వస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వయసురీత్యా తన వారసుడిని బరిలో కి దింపాలని శ్రీనివాస్‌రెడ్డి భావిస్తున్నారు. ఈ విషయమై ఇటీవల సీఎంను కలిసినప్పుడు వచ్చే ఎన్నికల్లో తనకు బదులు తన కొడుకుకు టికెట్ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు కేసీఆర్సర్వే శ్రీనివాస్‌రెడ్డికి అనుకూలంగా ఉందని, ఆయన కొడుకులకు నియోజకవర్గంలో నెగెటివ్ఉందని, అందుకే సీఎం హామీ ఇవ్వలేకపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అసెంబ్లీ సమావేశాల్లో ఆదివారం పోచారం తన మనుసులో మాటను ఈ విధంగా బయటపెట్టినట్లు ఆయన వర్గీయులు భావిస్తున్నారు.